Happy holi offer from air costa

Happy Holi’ offer from Air Costa, Air Costa announces another offer, Air Costa Happy Holi offer, Air costa starting fare of Rs 999, economy class ticket booking offer, Air costa offer, Air Costa economic air lines, Air Costa flight tickets, Air Costa flight timings, Air Costa shedules, Air Costa rs. 999 offer

Air Costa today announced the launch of Happy Holi offer for its customers with a starting fare of Rs 999 (all-inclusive), on every economy class ticket booking across its network.

హోళి కేళికి సిద్దమైన ఎయిర్ కోస్తా.. బంఫర్ ఆఫర్..

Posted: 02/25/2015 02:17 PM IST
Happy holi offer from air costa

హోలీ ఆయిరే.. ఆయిరే అయిరే హోలీ అయిరే అని రంగుల కేళీ పండుగను ఆస్వాదించాలనుకుంటున్నారా..? ఈ హోలీ పండుగను మునుపెన్నడూ లేని విధంగా జరుపుకునేందుకు దేశవాలీ విమానయాన సంస్ధ మీకు మరో బంపర్ ఆఫర్ ను అందించనుంది. హోలీ పండుగను పురస్కరించుకుని ఎగిరే పైకెగిరే అన్నట్లుగా మీ కలలను నిజం చేసేందుకు సన్నధమంది. నమ్మశక్యం కలగడం లేదా..? నిజమండి. హోళీ పర్యదినాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు ఎయిర్‌కోస్టా తగ్గింపు ధరలను ప్రకటించింది.

'హ్యాపీ హోలీ ఆఫర్' కింద కంపెనీ సేవలందిస్తున్న మార్గాల్లో అన్ని రుసుంలు కలిపి ఎకానమీ విభాగం టికెట్ ధర రూ.999 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్చి 15 నుంచి సెప్టెంబరు 30 మధ్య కాలంలో ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 26 (మధ్యాహ్నం 12 గంటల నుంచి) మార్చి 3 (మధ్యాహ్నం 12 గంటలు) వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. సీట్లు పరిమితంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్, విజయవాడల మధ్య ఛార్జీ రూ.999 కాగా.. హైదరాబాద్-తిరుపతి ఛార్జీ రూ.1,499. మార్గాన్ని బట్టి ఇతర మార్గాల ఛార్జీలు ఉంటాయని విమానయాన సంస్థ యాజమాన్య వర్గాలు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : happy holi  Air costa  Rs. 999 offer  

Other Articles